encounter: ఎన్ కౌంటర్ నుంచి మరోసారి తప్పించుకున్న మావోయిస్టు అగ్రనేత ఆర్కే
- ఏవోబీ బలిమెల రిజర్వాయర్ సమీపంలో ఎదురు కాల్పులు
- పలువురు మావోలు గాయపడినట్టు సమాచారం
- మావోల కిట్ బ్యాగులను స్వాధీనం చేసుకున్న పోలీసులు
మరో ఎన్ కౌంటర్ నుంచి మావోయిస్టు అగ్రనేత ఆర్కే తప్పించుకున్నారు. ఈ ఉదయం ఆంధ్ర-ఒడిశా బోర్డర్ లోని బలిమెల రిజర్వాయర్ పరిధిలో ఉన్న సిమిలిపొదర్ అటవీ ప్రాంతంలో ఏపీ గ్రేహౌండ్స్ దళాలు, ఒడిశా పోలీసు బలగాలకు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో పలువురు మావోయిస్టులు గాయపడినట్టు తెలుస్తోంది. అగ్రనేత ఆర్కే తృటిలో తప్పించుకున్నారు. ఘటనా స్థలంలో మావోల కిట్ బ్యాగులను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. మరోవైపు, ఎన్ కౌంటర్ కు సంబంధించి ఇప్పుడు పూర్తి వివరాలను వెల్లడించలేమని పోలీసు అధికారులు చెప్పారు.