stock market: నష్టాల్లోనే ముగిసిన స్టాక్ మార్కెట్లు!
- అమ్మకాలకు మొగ్గు చూపిన ఇన్వెస్టర్లు
- 239 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
- 58 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ
అంతర్జాతీయంగా చోటు చేసుకున్న పరిణామాలతో పాటు, ముడి చమురు ధరలు మరింత పెరగడం స్టాక్ మార్కెట్లపై ప్రభావం చూపింది. ముడి చమురు ధరలు ద్రవ్యోల్బణంపై ప్రభావం చూపుతాయనే భయంతో ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గు చూపారు. దీంతో మార్కెట్లు నష్టాలలో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి... సెన్సెక్స్ 239 పాయింట్లు కోల్పోయి 35,149కు పడిపోయింది. నిఫ్టీ 58 పాయింట్లు నష్టపోయి 10,683కు చేరింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
రిలయన్స్ కమ్యూనికేషన్స్ (56.87%), రిలయన్స్ నేవల్ అండ్ ఇంజినీరింగ్ లిమిటెడ్ (33.07%), హెచ్డీఐఎల్ (8.21%), పెట్రోనెట్ ఎల్ఎన్జీ లిమిటెడ్ (8.05%), రాడికో ఖైతాన్ లిమిటెడ్ (7.94%).
టాప్ లూజర్స్:
పీటీసీ ఇండియా (-9.23%), జీఎస్ఎఫ్సీ (-6.91%), టైమ్ టెక్నోప్లాస్ట్ లిమిటెడ్ (-5.02%), సెంచురీ ప్లైబోర్డ్స్ (-4.51%), డీబీ కార్ప్ లిమిటెడ్ (-4.26%).