mamatha: ఈ రోజు అధికారంలో ఉండొచ్చు.. రేపు ఉండకపోవచ్చు.. ఎందుకిలా చేస్తున్నారు?: మమతా బెనర్జీ
- కర్ణాటక రాజకీయాలపై దీదీ
- ఎమ్మెల్యేలతో బేరసారాలు చేస్తున్నారు
- ఈ పద్ధతి దేశానికి మంచిది కాదు
- ఇలా చేస్తే దేశ పరిస్థితులపై ప్రతికూల ప్రభావం చూపుతుంది
కర్ణాటకలో జరుగుతోన్న రాజకీయాలపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలతో ఇలా బేరసారాలు చేసే పద్ధతి దేశానికి మంచిది కాదని అన్నారు. తాము ప్రజాస్వామ్య పద్ధతులను ఎల్లప్పుడూ గౌరవిస్తామని అన్నారు. ఈ రోజు అధికారంలో ఉన్నవారు రేపు ఉండకపోవచ్చని, కానీ ఇలా రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడితే అది దేశ పరిస్థితులపై ప్రతికూల ప్రభావం చూపుతుందని అన్నారు.
కాగా, ఇటీవల పశ్చిమ బెంగాల్‌లో జరిగిన పంచాయతీ ఎన్నికలపై మమతా బెనర్జీ స్పందిస్తూ... ఈ ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి పనిచేసినప్పటికీ తమ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ 90 శాతం సీట్లను గెలుచుకుందని, దీన్ని బట్టి తాము గ్రామస్థాయి నుంచి ఎంత బలంగా ఉన్నామో తెలుస్తోందని అన్నారు.