Telangana: ఎంసెట్ ఫలితాలు: ఇంజనీరింగ్ లో వెంకటపాణి, అగ్రికల్చర్ లో నమ్రత టాపర్లు!
- తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల
- ఇంజనీరింగ్ లో మొదటి మూడు ర్యాంకులు ‘రంగారెడ్డి’కే
- అగ్రికల్చర్ లో టాపర్ గా నిలిచిన కర్నూలు వాసి నమ్రత
తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి విడుదల చేశారు. ఈ సందర్భంగా సచివాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కడియం శ్రీహరి మాట్లాడుతూ, ఎంసెట్ ర్యాంకుల వివరాలను ప్రకటిస్తున్నట్టు చెప్పారు. ఈ సందర్భంగా ఆయా విభాగాల్లో టాపర్ల వివరాలను వెల్లడించారు.
ఇంజనీరింగ్ విభాగంలో..
ఫస్టు ర్యాంక్ - వెంకటపాణి వంశీనాథ్ (రంగారెడ్డి), రెండో ర్యాంక్ -మైత్రేయ (రంగారెడ్డి), మూడో ర్యాంక్ - శ్రీవర్థన్ (రంగారెడ్డి), నాల్గో ర్యాంక్ - హేమంత్ కుమార్ (వైజాగ్), ఐదో ర్యాంక్ - మదన్ మోహన్ రెడ్డి ( కృష్ణాజిల్లా), ఆరో ర్యాంక్ - భరత్ (శ్రీకాకుళం)
అగ్రికల్చర్ విభాగంలో..
మొదటి ర్యాంక్ - నమ్రత (కర్నూలు) రెండో ర్యాంక్ - సంజీవ్ కుమార్ రెడ్డి, మూడో ర్యాంక్ - ఆర్యన్ (నిజామాబాద్), నాల్గో ర్యాంక్ - సంజన (మేడ్చల్)