Kamal Haasan: కర్ణాటక సంఘటనతో ప్రజాస్వామ్యశక్తులు ఏకం కానున్నాయి: కమలహాసన్
- కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ని కలిసిన కమల్
- మా పార్టీ ఇనాగ్యురల్ ఫంక్షన్ కోయంబత్తూరులో నిర్వహిస్తాం
- ఈ వేడుకకు విజయన్ ని ఆహ్వానించేందుకే ఆయన్ని కలిశా
ప్రజాస్వామ్యశక్తులు ఏకం కావడానికి కర్ణాటక సంఘటన నాంది పలికిందని మక్కళ్ నీది మయ్యం అధినేత, ప్రముఖ నటుడు కమలహాసన్ అన్నారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ని ఆయన కలిశారు. సుమారు అరగంటపాటు విజయన్ తో చర్చించినట్టు సమావేశం.
అనంతరం, కమల్ మీడియాతో మాట్లాడుతూ, మక్కళ్ నీది మయ్యం ఇనాగ్యురల్ ఫంక్షన్ ను కోయంబత్తూరులో నిర్వహించనున్నామని, ఈ వేడుకకు ఆయన్ని ఆహ్వానించే నిమిత్తం కలిశానని కమల్ చెప్పారు. ఈ వేడుక ఏ తేదీన నిర్వహించేది త్వరలో నిర్ణయిస్తామని అన్నారు. కేరళలో ఎల్ డీఎఫ్ ప్రభుత్వం పాలన బాగుందని ప్రశంసించారు. ఈ సందర్భంగా కావేరీ జలాల వ్యవహారం గురించి ప్రస్తావించారు. కాగా, ఓ ప్రైవేట్ టీవీ ఛానెల్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో పాల్గొనే నిమిత్తం కమల్ నిన్న కేరళ వెళ్లారు. ఈ సందర్భంగా కొచ్చిలో పినరయి విజయన్ ని కమల్ కలవడం జరిగింది.