Bombay high court: తల్లిని వేధించేవారికి ఆమె ఇంట్లోకి ప్రవేశించే హక్కు ఉండదు: బాంబే హైకోర్టు సంచలన తీర్పు
- తనను మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నారన్న వృద్ధురాలు
- కుమారుడి కుటుంబాన్ని ఇంట్లోకి రాకుండా అడ్డుకున్న తల్లి
- బాధిత మహిళకు అనుకూలంగా తీర్పు
తల్లిని సరిగా చూసుకోని, వేధించే కుమారులుకు ఆమె ఇంట్లోకి ప్రవేశించే హక్కు లేదని బాంబే హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 72 ఏళ్ల తల్లి తనను ఇంట్లోకి రానివ్వడం లేదంటూ దక్షిణ ముంబైకి చెందిన ఓ వ్యక్తి, భార్య, కుమారుడితో కలిసి బాంబే హైకోర్టును ఆశ్రయించాడు. తల్లిని సరిగా చూసుకోని కుమారుడు ఆ ఇంట్లోకి ప్రవేశించే హక్కును కోల్పోతాడని జస్టిస్ షారూఖ్ కథవాలా పేర్కొన్నారు. తల్లిని సరిగా చూసుకోని, ఆమెను తీవ్రంగా వేధించి, కొన్నిసార్లు దాడులకు సైతం దిగే కుమారులకు ఆమె ఇంట్లోకి వెళ్లే హక్కు లేదని న్యాయమూర్తి తేల్చి చెప్పారు.
ఈ కేసులో భాగంగా న్యాయమూర్తి ఎదుట హాజరైన వైద్యురాలైన బాధిత వృద్ధురాలు మాట్లాడుతూ.. గత కొన్నేళ్లుగా కుమారుడు తనను చిత్ర హింసలు పెడుతున్నాడని, మానసికంగా, శారీరకంగా హింసిస్తున్నాడని తెలిపింది. ఇక ఈ వేధింపులు భరించలేనని మొరపెట్టుకుంది. వాదనలు విన్న కోర్టు ఆ ఇంటిని ఖాళీ చేయాలని, ఆ ఇంట్లో ఉన్న వారి వస్తువులను హైకోర్టు కమిషనర్ సమక్షంలో తీసుకెళ్లాలని తీర్పు చెప్పింది. ఇకపై కుమారుడి నుంచి ఎటువంటి బాధలు ఉండవని బాధిత వృద్ధురాలికి కోర్టు హామీ ఇచ్చింది.