ali: ఒకరిని కిందకి లాగాలనుకుంటే .. దేవుడు మనల్ని కిందికి తోసేస్తాడు: అలీ
- ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండాలి
- ఎదుటివాడి ఎదుగుదలను అడ్డుకోకూడదు
- అలా చేస్తే దేవుడు చూస్తూ ఊరుకోడు
అలీ ఒక వైపున కమెడియన్ గా కొనసాగుతూనే .. మరో వైపున హీరోగా చేశారు. హీరో అయ్యాను కదా అనేసి ఆయన కామెడీ పాత్రలను దూరం చేసుకోలేదు. అంతకుముందు వున్న పరిచయాలను ఎంతమాత్రం వదులుకోలేదు. అందుకే ఆయన కెరియర్లో గ్యాప్ అనేది రాలేదు. ఇదే విషయాన్ని గురించి ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో అడగ్గా, ఆయన తనదైన శైలిలో స్పందించారు.
"ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలనే పెద్దల మాటను నేను పాటించాను .. ఇది ప్రతి ఒక్కరూ పాటించవలసిందే. మన టైమ్ బాగున్నపుడు మనల్ని అందరూ పొగుడుతుంటారు. టైమ్ బ్యాడ్ అయిందనుకోండి .. లేనిపోనివి సృష్టించి మనపై బురదజల్లడానికి రెడీగా వుంటారు. కష్టపడి పైకి వచ్చిన వాళ్లను అవకాశం దొరికితే చాలు కిందికి లాగేయాలనుకుంటారు. ఎదుటివాడి ఎదుగుదలను చూడలేక కిందికి లాగేయాలనే ఆలోచన నాకు వచ్చిందే అనుకోండి. ఆ నెక్స్ట్ డే భగవంతుడు నన్ను కిందికి లాగేస్తాడు .. ఎదుటివాడిని మూడో మెట్టు పై నుంచి పద మూడో మెట్టుపైకి తీసుకెళ్తాడు" అంటూ చెప్పుకొచ్చారు.