Cricket: మహిళా క్రికెటర్లకు ఆల్ ది బెస్ట్ చెబుతూ విరాట్ కోహ్లీ వీడియో
- వచ్చే ఏడాది నుంచి ఉమెన్స్ ఐపీఎల్ మ్యాచ్‌లు
- రేపు రెండు జట్ల మధ్య ఏకైక మ్యాచ్
- ముంబయిలోని వాంఖడే స్టేడియంలో మ్యాచ్
- ఈ మ్యాచు టీజర్ లాంటిదన్న కోహ్లీ
భారత్‌లో వచ్చే ఏడాది నుంచి ఉమెన్స్ ఐపీఎల్ మ్యాచ్‌లు నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోంది. అందుకోసం రేపు రెండు ఉమెన్స్ జట్లకి మధ్య ఏకైక మ్యాచ్ నిర్వహించనుంది. ట్రైల్బ్లేజర్, సూపర్నోవాస్ జట్లకి మధ్య ఎగ్జిబిషన్ మ్యాచ్ పేరిట రేపు మధ్యాహ్నం 2.30 గంటలకి ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఉమెన్స్ ఐపీఎల్ నిర్వహిస్తున్నందుకు ఆ మ్యాచ్‌లు చూడాలని తనకు కూడా ఉత్సాహంగా ఉందని తెలుపుతూ టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఈ రోజు ఓ వీడియో విడుదల చేశాడు.
మొత్తం 31 సెకన్ల పాటు ఉన్న ఆ వీడియో ద్వారా కోహ్లీ సందేశం ఇచ్చాడు. రేపు ముంబయిలోని వాంఖడే స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుందని, ఉమెన్స్ ఐపీఎల్ నిర్వహించే క్రమంలో ఈ మ్యాచు ఓ టీజర్ లేక ట్రైలర్ లాంటిదని, ఒక విధంగా అంతకన్నా ఎక్కువని అభివర్ణించాడు. ట్రైల్బ్లేజర్ జట్టు సారథి స్మృతి మంధనా, సూపర్నోవాస్ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌కి ఆల్ ది బెస్ట్ చెబుతున్నట్లు విరాట్ కోహ్లీ పేర్కొన్నాడు. కాగా వాంఖడే స్టేడియంలో రేపు ఈ మ్యాచ్ ముగియగానే రాత్రి 7 గంటలకి సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నయ్ సూపర్ కింగ్స్ జట్ల మధ్య ఐపీఎల్ మొదటి క్వాలిఫయర్ మ్యాచ్ జరగనుంది.