hd kumaraswamy: కుమారస్వామి ప్రమాణస్వీకారానికి వ్యతిరేకంగా పిటిషన్... అత్యవసర విచారణకు నిరాకరించిన సుప్రీంకోర్టు

  • సుప్రీంకోర్టులో అఖిల భారత మహాసభ పిటిషన్
  • రాజ్యాంగ విరుద్ధమని పిటిషనర్ అభ్యంతరం 
  • రేపు ప్రమాణం చేయనున్న కుమారస్వామి
  • సుప్రీంకోర్టు తాజా తీర్పుతో తొలగిన అడ్డంకులు

కర్ణాటక ముఖ్యమంత్రిగా జేడీఎస్ నేత హెచ్ డీ కుమారస్వామి ప్రమాణ స్వీకారం చేయనుండడాన్ని అఖిల భారత హిందూ మహాసభ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. కుమారస్వామిని ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించడం రాజ్యంగ విరుద్ధమని, దాన్ని అడ్డుకోవాలని కోరింది. కాంగ్రెస్, జేడీఎస్ జతకట్టడాన్ని రాజ్యాంగ విరుద్ధంగానూ పేర్కొంది. కర్ణాటక ముఖ్యమంత్రిగా కుమారస్వామి బుధవారం ప్రమాణం చేయనున్న విషయం తెలిసిందే. అయితే, ఈ పిటిషన్ పై ముందస్తు విచారణకు సుప్రీంకోర్టు తిరస్కరించింది. దీంతో కుమారస్వామి సీఎంగా పదవీ ప్రమాణానికి అడ్డంకులు తొలగిపోయాయి. 

  • Loading...

More Telugu News