Subramanian Swamy: రమణ దీక్షితులకు సుబ్రహ్మణ్యస్వామి మద్దతు... సుప్రీంకోర్టుకు వెళతానని ప్రకటన

  • టీటీడీ చట్ట విరుద్ధంగా వ్యవహరించడాన్ని సవాల్ చేస్తా
  • కోర్టు పర్యవేక్షణలో టీటీడీ వ్యవహారాలపై సీబీఐ దర్యాప్తు కోరుతా
  • ట్విట్టర్లో ప్రకటించిన సుబ్రహ్మణ్యస్వామి
తిరుమల శ్రీవారి ఆలయ ప్రధానార్చకుడిగా బలవంతపు పదవీ విరమణకు గురైన రమణ దీక్షితులకు ప్రముఖ న్యాయ కోవిదుడు, బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్యస్వామి మద్దతు పలికారు. ప్రధానార్చకుడి పదవి నంచి రమణ దీక్షితులను తొలగించేందుకు టీడీడీ చట్ట విరుద్ధంగా వ్యవహరించిన తీరును చూసిన తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్టు స్వామి తెలిపారు.

రమణ దీక్షితులు తొలగింపును కొట్టివేయాలని, టీటీడీలో నిధుల దుర్వినియోగంపై సుప్రీం కోర్టు పర్యవేక్షణలో సీబీఐ విచారణను కోరనున్నట్టు స్వామి చెప్పారు. శ్రీవారి ఆలయ నిర్వహణ, స్వామి వారి కైంకర్యాల విషయంలో అధికారులు, ప్రభుత్వ జోక్యాన్ని రమణ దీక్షితులు తప్పు బట్టిన విషయం తెలిసిందే. కొన్ని అవకతవకలు కూడా జరుగుతున్నాయని ఆరోపించారు. ఆయన ఆరోపణలను టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ఖండించిన విషయం తెలిసిందే.
Subramanian Swamy
ramana dikshitulu
ttd

More Telugu News