kareena kapoor: చమురు ధరల ఎఫెక్ట్.. కుప్పకూలిన మార్కెట్లు
- భారీగా పతనమైన స్టాక్ మార్కెట్లు
- 306 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
- 10,430కు పడిపోయిన నిఫ్టీ
నిన్న స్వల్ప లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు ఈరోజు మళ్లీ పతనమయ్యాయి. పెట్రోలియం ఉత్పత్తుల ధరలు ఆకాశాన్ని అంటడంతో... మదుపర్లు అమ్మకాలకు మొగ్గు చూపారు. ఈ నేపథ్యంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ ఏకంగా 306 పాయింట్లు పతనమై 34,345కి పడిపోయింది. నిఫ్టీ 106 పాయింట్లు కోల్పోయి 10,430కు దిగజారింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
మార్క్ శాన్స్ ఫార్మా (10.42%), శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్ (8.06%), ఎల్ అండ్ టీ ఇన్ఫోటెక్ (6.70%), ఐడీబీఐ బ్యాంక్ (6.00%), ఆంధ్రా బ్యాంక్ (5.22%).
టాప్ లూజర్స్:
హిందుస్థాన్ పెట్రోలియం (-8.06%), బలరామ్ పూర్ చీనీ మిల్స్ (-7.42%), టాటా స్టీల్ (-6.57%), సెంచురీ టెక్స్ టైల్స్ (-6.41%), వేదాంత లిమిటెడ్ (-6.23%).