savithri: జెమినీ గణేశన్ తో పెళ్లి .. సావిత్రి చేసిన సరిదిద్దుకోలేని తప్పు: సీనియర్ తమిళ నటుడు రాజేశ్
- జెమినీ గణేశన్ లైఫ్ స్టైల్ ప్రత్యేకం
- సావిత్రికి సరిపడని మనస్తత్వం ఆయనది
- ఆ విషయాలు ఆమెకు ముందే తెలుసు
తెలుగులో ఈ నెల 9వ తేదీన 'మహానటి' సినిమా విడుదలైతే, ఈ నెల 11వ తేదీన తమిళంలో 'నడిగైయార్ తిలగం' అనే పేరుతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ రెండు భాషల్లోను ఈ సినిమా భారీ వసూళ్లను సాధిస్తూ దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలోనే సావిత్రిని గురించి కొంతమంది సీనియర్ నటీనటులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అలా జెమినీ గణేశన్ కి సన్నిహితుడు .. నటుడు ఆయన రాజేశ్ తమిళ వెర్షన్ చూసి స్పందించారు.
"జెమినీ గణేశన్ కి అంతకుముందే పెళ్లి అయిన విషయం సావిత్రికి తెలుసు. అలాంటివాడితో ప్రేమలో పడకూడదు అనే విషయం సావిత్రికి తెలియకుండా ఎలా ఉంటుంది? జెమినీ గణేశన్ లైఫ్ స్టైల్ .. ఆయన ప్రవర్తన ప్రత్యేకంగానే ఉండేవి. అవి తెలిసి కూడా సావిత్రి ఆయనకి దగ్గరయ్యారు. ఇక సావిత్రికి జెమినీ గణేశన్ మద్యాన్ని అలవాటు చేసి ఉండొచ్చు .. కానీ ఆమె దానిని వ్యసనంగా మార్చుకున్నారు. తన మనస్తత్వానికి ఎంతమాత్రం సరిపడని వ్యక్తిని వివాహం చేసుకోవడమే సావిత్రి తన జీవితంలో చేసిన సరిదిద్దుకోలేని తప్పు" అని ఆయన చెప్పుకొచ్చారు.