Tirumala: చంద్రబాబుపై ఆరోపణలు తగదు: టీటీడీ చైర్మన్ పుట్టా
- విజయసాయిరెడ్డి ఆరోపణలు తగదు
- రమణ దీక్షితుల ఆరోపణలు అవాస్తవం
- ఏదైనా జరిగి ఉంటే అందుకు ఆయన కూడా బాధ్యులే
తిరుమల శ్రీవారి నగలు మాయమయ్యాయని, ఆ నగలు సీఎం చంద్రబాబు ఇంట్లో ఉన్నాయంటూ ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ ఆరోపణలను టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ ఖండించారు. ఇటువంటి ఆరోపణలు చేయడం తగదని హితవు పలికారు. తిరుమల శ్రీవారి నగల గురించి రమణదీక్షితులు చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని, 1952 నుంచి ఆయన టీటీడీలోనే ఉన్నారని, ఏదైనా జరిగి ఉంటే అందుకు ఆయన కూడా బాధ్యలవుతారని అన్నారు.
కాగా, సీపీఐ రామకృష్ణ మాట్లాడుతూ, దేవాలయాలపై రాజకీయ జోక్యం తగదని, టీడీపీపై బీజేపీ అనుసరిస్తున్న విధానం సరికాదని అన్నారు. రమణదీక్షితులను బీజేపీ, ఆర్ఎస్ఎస్ పావుగా వాడుకుంటున్నాయని విమర్శించారు. మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తన అధీనంలోకి తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారని, రాష్ట్ర పరిధిలోని దేవాలయాలను కేంద్రం కబ్జా చేసేందుకు కుట్ర పూరితంగా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు.