MAHA BODHI: బుద్ధ గయ బాంబు పేలుళ్ల కేసులో ఐదుగురు నిందితులను దోషులుగా ప్రకటించిన కోర్టు

  • నిందితులు అందరూ ఇండియన్ ముజాహిదీన్ సభ్యులు
  • వచ్చే వారం వీరికి శిక్షల్ని ఖరారు చేయనున్న పాట్నాలోని ప్రత్యేక కోర్టు
  • 2013 జూలై 7నాటి బాంబు పేలుళ్ల ఘటనలో ఐదుగురికి గాయాలు

బిహార్లోని బుద్ధగయ క్షేత్రంలో 2013లో జరిగిన బాంబు పేలుళ్ల కేసులో ఐదుగురు నిందితులను దోషులుగా పాట్నాలోని ప్రత్యేక కోర్టు ఈ రోజు ప్రకటించింది. ఈ ఐదుగురు దోషులూ ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థ సభ్యులు. 2013 జూలై 7న మహాబోధి ఆలయం, పరిసర ప్రాంతాల్లో పది బాంబు పేలుళ్లు జరిగాయి. నాటి ఘటనలో ఐదుగురు గాయపడ్డారు. వీరిలో ఇద్దరు బౌద్ధ సన్యాసులు ఉన్నారు. అదృష్టవశాత్తూ ప్రాణాపాయం చోటు చేసుకోలేదు.

దీనిపై పాట్నాలోని ప్రత్యేక న్యాయస్థానం విచారణ జరిపింది. నిందారోపణలను ఎదుర్కొంటున్న హైదర్ అలి, మరో నలుగుర్ని దోషులుగా నిర్ధారించింది. వీరికి వచ్చే గురువారం శిక్షల్ని ఖరారు చేయనుంది. బుద్ధగయలోనే బుద్ధుడికి జ్ఞానోదయం అయినట్టు చెబుతారు. బౌద్ధులకు ఇది అత్యంత పవిత్రమైన ప్రదేశం. 

  • Loading...

More Telugu News