Ramgopal Varma: సినిమా తీయడం నేర్పిస్తా: ఫిల్మ్ స్కూల్ ప్రారంభిస్తున్నానన్న రాంగోపాల్ వర్మ
- ఔత్సాహిక యువతీ యువకులకు శిక్షణ
- ఆర్వీజీ అన్ స్కూల్ పేరిట ఏర్పాటు
- వెల్లడించిన రామ్ గోపాల్ వర్మ
తన వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యమూ వార్తల్లో నిలిచే దర్శకుడు రాంగోపాల్ వర్మ మరో కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. సినీ రంగంలోకి ప్రవేశించి రాణించాలని భావించే ఔత్సాహిక యువతీ యువకులకు సహాయపడి, వారికి కావాల్సిన శిక్షణ ఇచ్చేలా వర్మ ఫిల్మ్ స్కూల్ ను ప్రారంభించనున్నట్టు తన ట్విట్టర్ ఖాతా ద్వారా వర్మ తెలిపారు.
నూతన టెక్నాలజీతో పాటు, డిఫరెంట్ మేకింగ్ ను ఇక్కడ నేర్పిస్తామని ఆయన అన్నారు. న్యూయార్క్ కు చెందిన డాక్టర్ రామ్ స్వరూప్, డాక్టర్ శ్వేతా రెడ్డిల సహకారంతో ఈ స్కూల్ ను ప్రారంభిస్తానని చెప్పారు. దీనికి 'ఆర్వీజీ అన్ స్కూల్' అని పేరు పెట్టానని, మరిన్ని వివరాలను నేడు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి వెల్లడిస్తానని అన్నారు.