kamaa selvaraj: ‘మహానటి’లో తన తండ్రి పాత్రపై అసంతృప్తి.. ఓ డాక్యుమెంటరీ తీస్తున్న కమలా సెల్వరాజ్!
- ‘మహానటి’లో తన తండ్రి పాత్రను సరిగ్గా చూపించలేదన్న కమల
- ‘కాదల్ మన్నన్’ అనే టైటిల్ తో రూపొందించిన డాక్యుమెంటరీ
- త్వరలో మీడియా ముందుకు తీసుకురానున్నట్టు సమాచారం
సావిత్రి జీవితకథ ఆధారంగా తెరకెక్కిన ‘మహానటి’ హిట్ టాక్ తో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. పలువురు సినీ ప్రముఖులు, రాజకీయనేతలు, పలు రంగాలకు చెందిన ప్రముఖులు ఇప్పటికే ప్రశంసలు కురిపించారు. అయితే, ఈ చిత్రంలో తన తండ్రి పాత్రను చూపించిన తీరు సరిగ్గా లేదని జెమినీగణేశన్, మొదటిభార్య అలిమేలు దంపతుల కుమార్తె కమలా సెల్వరాజ్ విమర్శించిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో ‘మహానటి’లో తన తండ్రి పాత్రను చూపించిన తీరుకు నొచ్చుకున్నానని, అందుకే, తన తల్లిదండ్రులపై ఓ డాక్యుమెంటరీ నిర్మించానని ఆమె చెప్పారు. ‘కాదల్ మన్నన్’ అనే టైటిల్ తో రూపొందించిన ఈ డాక్యుమెంటరీ నిడివి 100 నిమిషాలు ఉంటుందని, దీనిని త్వరలోనే మీడియా ముందుకు ఆమె తీసుకురానున్నట్టు తెలుస్తోంది.