ipl -11: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న చెన్నై సూపర్ కింగ్స్
- ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్
- తలపడనున్న చెన్నై సూపర్ కింగ్స్ - హైదరాబాద్ సన్ రైజర్స్
- ఈ రెండు జట్లు ఇప్పటి వరకు మూడుసార్లు తలపడ్డ వైనం
ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ -హైదరాబాద్ సన్ రైజర్స్ జట్ల మధ్య జరగనుంది. చెన్నై సూపర్ కింగ్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన ‘సూపర్ కింగ్స్’ కెప్టెన్ ధోనీ, సన్ రైజర్స్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించాడు. ఈ టోర్నీలో ఈ రెండు జట్లు ఇప్పటి వరకు మూడుసార్లు తలపడ్డాయి. మూడుసార్లు సూపర్ కింగ్సే విజయం సాధించింది.
కాగా, ధోని మాట్లాడుతూ, ఇప్పటివరకు తమ ప్రయాణం అద్భుతంగా సాగిందని, అయితే, ఏ విషయాన్ని కూడా కొన్నిసార్లు అంచనా వేయలేమని అన్నాడు. కొత్త జట్టు కంటే తమ వద్ద ఉన్న కీలక ఆటగాళ్లతోనే బరిలోకి దిగుతున్నామని.. అయితే, ఒకే ఒక మార్పు జరిగిందని, హర్భజన్ సింగ్ స్థానంలో కరణ్ శర్మ బరిలోకి దిగుతున్నట్టు చెప్పాడు.
అనంతరం, సన్ రైజర్స్’ కెప్టెన్ కేన్ విలియమ్ సన్ మాట్లాడుతూ, మంచి ప్రదర్శన కనబరుస్తామని, పరిస్థితులను తమకు అనుకూలంగా మలచుకుంటామని చెప్పాడు. తమ జట్టులో రెండు మార్పులు జరిగాయని ఖలీల్ స్థానంలో సందీప్ శర్మ, వృద్ధిమాన్ సాహా స్థానంలో గోస్వామి ఆడుతున్నట్టు చెప్పాడు.