Karimnagar District: ఇది మృత్యుశకటమే... రాజీవ్ రహదారిపై రోడ్డు ప్రమాదం దృశ్యాలివిగో!
- వరంగల్ నుంచి కరీంనగర్ వెళుతున్న బస్సు
- లారీని ఢీకొట్టడంతో ఘోర ప్రమాదం
- ఏడుకు పెరిగిన మృతులసంఖ్య
వరంగల్ నుంచి కరీంనగర్ వెళుతున్న టీఎస్ఆర్టీసీ బస్ (టీఎస్ 02 జడ్ 0299) వేగంగా వెళుతూ, మరో లారిని ఢీకొన్న ఘటనలో మృతుల సంఖ్య ఏడుకు పెరిగింది. ప్రమాద విషయం తెలుసుకున్న తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ హుటాహుటిన ఘటనా స్థలికి వెళ్లి సహాయక చర్యలను పర్యవేక్షించారు.
గాయపడిన వారి ప్రాణాలు పోరాదని, క్షతగాత్రులకు మెరుగైన చికిత్సను అందించాలని ఆదేశించారు. మెరుగైన చికిత్స కోసం ఎనిమిది మందిని హైదరాబాద్ కు తరలించాలని సూచించారు. ప్రమాదం గురించి తెలుసుకున్న కేసీఆర్, తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈటలతో మాట్లాడిన ఆయన, ప్రాణనష్టం పెరగకుండా చూడాలని కోరారు. బస్సు ప్రమాద దృశ్యాలివి.