monsoon: మూడు రోజుల ముందే వచ్చేసిన రుతుపవనాలు!
- కేరళ తీరాన్ని తాకిన రుతుపవనాలు
- ఇప్పటికే అరేబియా సముద్రం, బంగాళాఖాతంలోకి విస్తరణ
- వెల్లడించిన భారత వాతావరణ శాఖ
నైరుతి రుతుపవనాలు వేగం పుంజుకున్నాయి. ఈ రోజు ఇవి కేరళ తీరాన్ని తాకాయి. జూన్ 1న షెడ్యూల్ ప్రకారం కేరళకు రుతుపవనాలు రావాల్సి ఉండగా, మూడు రోజుల ముందే అవి చేరుకున్నాయని భారత వాతావరణ శాఖ ఈ రోజు ప్రకటన జారీ చేసింది. తమిళనాడు తీరాన్ని కూడా ఇవి ఈ రోజు చేరుకుంటాయని ప్రకటించింది.
గత శుక్రవారం అండమాన్ నికోబార్ దీవులను చేరిన రుతుపవనాలు సోమవారం నాటికి అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాలకు, బంగాళాఖాతంలోకి విస్తరించాయి. ముందు రోజు వర్షపాత వివరాలను తీసుకున్న అనంతరం రుతుపవనాల ఆగమనం గురించి ప్రకటిస్తున్నామని వాతావరణ అంచనాల విభాగం ముఖ్య అధికారి కె సతీదేవి తెలిపారు.