hemachnadra: శ్రావణ భార్గవి కారు డ్రైవింగ్ గురించి హేమచంద్ర!
- ఎంతదూరమైనా ఫస్టు గేర్ లోనే
- ఒక పట్టాన సెకండ్ గేర్ వేయదు
- ఆమెకి రోడ్ రోలర్ అయితేనే కరెక్ట్
గాయనీ గాయకులుగా హేమచంద్ర .. శ్రావణ భార్గవికి మంచి గుర్తింపు వుంది. తాజాగా ఈ ఇద్దరూ 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంలో శ్రావణ భార్గవి కారు డ్రైవింగ్ గురించి హేమచంద్ర ప్రస్తావించాడు. "శ్రావణ భార్గవి కారు డ్రైవింగ్ చాలా చిత్రంగా ఉంటుంది. ఎన్ని కిలోమీటర్లయినా ఫస్టు గేర్ లోనే నడపగల సత్తా తనకి వుంది. పక్కనే కూర్చున్న నేను .. ఇంకా గేర్ మార్చదేంటని చూస్తుంటాను.
అదేంటి ఫస్టు గేర్ లో ఇలా ఎంత దూరం వెళదామని .. మార్చు అంటాను నేను. మారుస్తున్నాను ఆగు .. అంటూ చాలా సేపటి తరువాత సెకండ్ గేర్ లోకి వస్తుంది. మళ్లీ మూమూలే .. అట్లా సెకండ్ గేర్ లోనే వెళుతూ ఉంటుంది. అలా చాలా స్లోగా వెళుతూ స్టీరింగ్ పట్టుకోమని చెప్పి .. రోడ్డుకు పక్కనే వున్న షాప్స్ లోని డ్రెస్ లు చూస్తూ ఉంటుంది" అని చెప్పాడు. అయితే శ్రావణ భార్గవికి 'రోడ్ రోలర్' కరెక్ట్ అంటూ అలీ నవ్వేశారు.