YSRCP: అక్రమాస్తుల కేసు విచారణకు మరోసారి గైర్హాజరైన వైసీపీ ఎమ్మెల్యే

  • డిఎస్పీ దుర్గాప్రసాద్ అక్రమాస్తుల కేసులో ఏసీబీ నోటీసులు
  • అనారోగ్య కారణాలతో రెండోసారి విచారణకు గైర్హాజరైన ఆర్కే
  • వారం రోజులు గడువు ఇచ్చిన ఏసీబీ

డిఎస్పీ దుర్గాప్రసాద్ అక్రమాస్తుల కేసు విచారణకు మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే మరోసారి గైర్హాజరయ్యారు. కేసు విచారణ సందర్భంగా ఏసీబీ కార్యాలయానికి ఆయన లాయర్లు హాజరయ్యారు. ఆర్కే ఆరోగ్యం బాగోలేదని, ఆయన కుదుటపడటానికి మరింత సమయం పడుతుందని ఈ సందర్భంగా లాయర్లు తెలిపారు. ఆర్కేకు మరో వారం రోజుల గడువు కావాలని పిటిషన్ దాఖలు చేశారు.

ఈ నేపథ్యంలో వారం పాటు గడువు ఇస్తూ... కేసు విచారణను వచ్చే నెల 5వ తేదీకి వాయిదా వేశారు. డిఎస్పీ దుర్గాప్రసాద్ అక్రమాస్తుల కేసులో విచారణకు హాజరుకావాలంటూ ఏసీబీ సెక్షన్ 160 కింద ఆర్కేకు నోటీసులు జారీ అయిన విషయం తెలిసిందే. అనారోగ్య కారణాల వల్ల ఈ నెల 22న విచారణకు హాజరుకాలేనంటూ ఇంతకు ముందు ఒకసారి ఏసీబీకి ఆర్కే విన్నవించుకున్నారు. ఇప్పుడు మరోసారి గడువు కోరారు.

ఆమధ్య గుంటూరు డిఎస్పీ దుర్గాప్రసాద్ ని అక్రమాస్తులు కలిగి ఉన్నారంటూ ఏసీబీ అరెస్ట్ చేసింది. ఆ ఆస్తుల్లో కొన్ని ఎమ్మెల్యే ఆర్కే కుటుంబ సభ్యుల పేరిట వున్నాయంటూ ఆరోపణలొచ్చాయి. దీంతో ఆర్కేకు ఏసీబీ నోటీసులిచ్చింది.  

  • Loading...

More Telugu News