petrol: పెట్రోలు ధర ఒక్క పైసా తగ్గడానికి నెహ్రూనే కారణం.. నెటిజన్ల కామెడీ సెటైర్లు!
- లీటర్ కు ఒక్క పైసా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు
- కళ్లు తేలేసిన వాహనదారులు
- రకరకాల కామెంట్లతో విరుచుకుపడుతున్న నెటిజన్లు
ఇప్పటికే మండుతున్న ఎండలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న వాహనదారులకు... కేంద్ర ప్రభుత్వం తగ్గించిన పెట్రోల్, డీజిల్ ధరలు కళ్లు బైర్లు కమ్మేలా చేశాయి. లీటర్ కు ఒక్క పైసా చొప్పున తగ్గించిన ఆయిల్ కంపెనీలు తమ పెద్ద మనసును ఘనంగా చాటుకున్నాయి. ఈ నేపథ్యంలో నెటిజన్లు జోకులు, వ్యంగ్యాస్త్రాలతో విరుచుకుపడుతున్నారు. మచ్చుకు కొన్ని కామెంట్లు చూడండి.
- పెట్రోల్, డీజిల్ ధరలు ఒక్క పైగా తగ్గడానికి మాజీ ప్రధాని నెహ్రూనే కారణం. ఎందుకంటే పైసాను చలామణిలోకి తెచ్చింది ఆయనే.
- పెట్రోల్ ఒక్క పైసా తగ్గింది. వెంటనే ట్యాంకు ఫుల్ చేయించుకోండి. ఇలాంటి మంచి తరుణం మళ్లీ రాదు.
- హమ్మయ్య... ఒక్క పైసా ఆదా అయింది. దీన్ని ఎలా ఖర్చు చేయాలో అర్థం కావడం లేదు. ఏమేం కొనాలో లిస్ట్ తయారు చేసుకుంటా.
- ఎంత ఆనందంగా ఉందో. కోటీశ్వరుడిని అయ్యాననే భావన కలుగుతోంది.
- ఆదా అయిన ఇంత మొత్తాన్ని ఏం చేసుకోవాలో. ఒక్క పని చేస్తా... జన్ ధన్ ఖాతాలో జమ చేస్తా.
- ట్యాంక్ ఫుల్ చేస్తే 29 పైసలు మిగిలింది. ఈ డబ్బుతో ఏం చేయాలో సలహాలివ్వండి ప్లీజ్.
- భాయీ సాబ్... నేనైతే మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నా.
- మోదీ సార్... ప్రజలపై మీకు ఉన్న సానుభూతి వెలకట్టలేనిది. మీ రుణం తీర్చుకోలేము.