savitri: సావిత్రి అప్పుడు చాలా బాధపడ్డారట!
- సావిత్రిగారు చిన్న పాత్ర చేశారు
- పారితోషికం తక్కువే అయినా ఓకే అన్నారు
- మేకప్ చేసుకుని అలా వెయిట్ చేస్తూ ఉండేవారు
సావిత్రి గారికి ఆరోగ్యంతో పాటు ఆమెకి అవకాశాలు కూడా తగ్గుతూ వచ్చాయి. అయినా తప్పనిసరి పరిస్థితుల్లో ఆమె అంతగా ప్రాముఖ్యత లేని పాత్రలను పోషించారు. సీనియర్ జర్నలిస్ట్ ఇమంది రామారావు తాజాగా ఎస్ క్యూబ్ టీవీకి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో సావిత్రిని గురించి మాట్లాడుతూ ఒక సంఘటనను గురించి చెప్పారు.
"దాసరి నారాయణరావుగారి దగ్గర నేను సహకార దర్శకుడిగా చేశాను .. ఆ సమయంలో నేను 'సర్కస్ రాముడు' సినిమాకి కూడా పనిచేశాను. ఈ సినిమాలో ఒక చిన్న పాత్ర కోసం సావిత్రి గారికి 6 వేల రూపాయల పారితోషికాన్ని ఫిక్స్ చేశారు. బెంగుళూర్ లోని ఒక ప్యాలెస్ లో షూటింగ్ జరుగుతోంది. అప్పుడు ఆమె నా దగ్గరికి వచ్చి "తమ్ముడూ .. నేను వచ్చి నాలుగు రోజులవుతోంది .. రోజూ మేకప్ వేయించి వెయిట్ చేయిస్తున్నారు .. ఆ తరువాత షాట్ లేదంటున్నారు. ఆ విషయం ముందుగానే చెబితే వెళ్లి రెస్ట్ తీసుకుంటాను గదా .. కొంచెం వాళ్లకి చెప్పవూ" అన్నారు. అప్పుడు మాత్రం నాకు చాలా బాధనిపించింది" అంటూ చెప్పుకొచ్చారు.