Pranab Mukherjee: ఆరెస్సెస్ మీటింగ్‌లో 'కొత్త వాదం'తో బీజేపీకి షాకివ్వనున్న ప్రణబ్!

  • ఈనెల 7న ఆరెస్సెస్ స్నాతకోత్సవం
  • బీజేపీ జాతీయవాదానికి వ్యతిరేకంగా ప్రసంగం
  • ఇరుకున పడనున్న బీజేపీ, ఆరెస్సెస్

ఆరెస్సెస్ స్నాతకోత్సవానికి హాజరు కాబోతున్న మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వారికి షాకివ్వనున్నట్టు తెలుస్తోంది. నాగ్‌పూర్‌లోని ఆరెస్సెస్ ప్రధాన కార్యాలయంలో జరగనున్న ఈ కార్యక్రమంలో ప్రసంగించనున్న ఆయన బీజేపీ జాతీయ వాదానికి వ్యతిరేకంగా ప్రత్యామ్నాయ జాతీయవాదం గురించి మాట్లాడి షాకివ్వనున్నట్టు సమాచారం. తద్వారా బీజేపీ, ఆరెస్సెస్ రెండింటినీ ఇరకాటంలో పెట్టనున్నారు.

బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జాతీయవాదం ప్రజల్లోకి విపరీతంగా చొచ్చుకెళ్లింది. దానికి వ్యతిరేకంగా మాట్లాడిన వారిని దేశ ద్రోహులుగా చిత్రీకరించడం మొదలుపెట్టారు. ఫలితంగా మతవిద్వేషాలు, అసహనం వంటి వాటిపై ఎడతెగని చర్చ జరిగింది. ఇప్పుడు అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని భావిస్తున్న ప్రణబ్ ‘దాదా’ ప్రత్యామ్నాయ జాతీయవాదంపై ప్రసంగించేందుకు సిద్ధమయ్యారు. అసలు ప్రత్యామ్నాయ జాతీయవాదం అంటే ఏమిటి? మత సామరస్యం ఎలా ఉండాలి? వంటి వాటిని బోధించేందుకు రెడీ అవుతున్నారట. జూన్ 7న జరగనున్న ఆరెస్సెస్ కార్యక్రమంలో ప్రణబ్ ప్రసంగం దేశం గర్వించేలా ఉంటుందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News