Tirumala: తెలంగాణ ఎమ్మెల్యే సిఫారసు లేఖపై తిరుమల బ్రేక్ దర్శనం టిక్కెట్లు... రూ. 30 వేలకు కొని దొరికిపోయాడు!

  • మరోసారి బట్టబయలైన వీఐపీ టిక్కెట్ల దందా
  • ఒక్కోటి రూ. 6 వేలకు ఐదు టిక్కెట్లను కొన్న భక్తుడు
  • క్యూలైన్ లో పట్టుకున్న విజిలెన్స్ అధికారులు

తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనం టిక్కెట్ల దందా మరోసారి బట్టబయలైంది. ఐదు ఎల్-3 శ్రేణి టికెట్లను రూ. 30 వేలకు ఓ బ్రోకర్ అమ్మగా, భక్తులు దర్శనానికి వెళుతున్న సమయంలో విజిలెన్స్ సిబ్బంది పట్టుకున్నారు. తెలంగాణకు చెందిన ఓ మాజీ మంత్రి, ప్రస్తుత మహిళా ఎమ్మెల్యే పేరిట సిఫారసు లేఖ ఉండటం గమనార్హం.

టీటీడీ విజిలెన్స్, వన్ టౌన్ పోలీస్ స్టేషన్ అధికారుల కథనం ప్రకారం, చిత్తూరు జిల్లా పుత్తూరుకు చెందిన వెంకయ్య, తన కుటుంబంతో తిరుపతి నుంచి తిరుమలకు వస్తున్న వేళ, కారు డ్రైవర్ కిరణ్ తనను తాను పరిచయం చేసుకుని, వీఐపీ బ్రేక్ దర్శనం టికెట్లు ఇప్పిస్తానని, ఒక్కో టిక్కెట్ కు రూ. 6 వేలవుతుందని చెప్పాడు. ఆపై తిరుమలలో జాఫర్ అనే వ్యక్తి సాయంతో వారికి ఎల్-3 టిక్కెట్లు ఇప్పించాడు. జేఈఓ కార్యాలయం మహిళా ఎమ్మెల్యే సిఫారసుపై వీటిని జారీ చేసింది.

ఈ మొత్తం వ్యవహారం విజిలెన్స్ దృష్టికి రావడంతో, వారు క్యూలైన్ అధికారులను అప్రమత్తం చేశారు. ఈ కుటుంబం దర్శనానికి వెళుతున్న సమయంలో కూపీ లాగగా, మొత్తం వ్యవహారం బట్టబయలైంది. విజిలెన్స్ అధికారుల ఫిర్యాదు మేరకు తిరుపతి వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.

  • Loading...

More Telugu News