arbaazkhan: బెట్టింగులో రూ.3 కోట్లు నష్టపోయిన సల్మాన్ సోదరుడు!

  • దావూద్ అనుచరుడి వద్ద బెట్టింగ్
  • డబ్బులు చెల్లించకపోవడంతో బెదిరింపులు
  • మరింతమంది పేర్లు బయటకు వచ్చే అవకాశం

ఐపీఎల్ బెట్టింగ్ స్కాంలో అనూహ్యంగా బాలీవుడ్ నటుడు, నిర్మాత, దర్శకుడు అర్బాజ్ ఖాన్‌ పేరు బయటపడింది. విచారణ కోసం తమ ఎదుట హాజరు కావాల్సిందిగా థానే పోలీసులు అర్బాజ్‌కు సమన్లు  పంపించారు. తాజాగా అర్బాజ్‌కు చెందిన మరో విషయం బయటపడి సంచలనమైంది. అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం బుకీ సోను జలాన్ వద్ద బెట్టింగ్ కాసిన అర్బాజ్ ఏకంగా రూ.2.80 కోట్లు నష్టపోయినట్టు తెలుస్తోంది. తనకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకపోవడంతో జలాన్ బెదిరించినట్టు సమాచారం.

మే 16న థానెలోని డోమ్‌బీవ్లీలోని ప్రధాన బెట్టింగ్ స్థావరంపై దాడి చేసిన క్రైం బ్రాంచ్ పోలీసులు మొత్తం ఐదుగురిని అరెస్ట్ చేశారు. వారిని కోర్టులో హాజరు పరిచేందుకు తీసుకెళ్తున్న సమయంలో జలాన్ వారి కోసం ఎదురుచూస్తూ పోలీసులకు చిక్కాడు. అతడిని విచారిస్తున్న సమయంలో అర్బాజ్ పేరును బయటపెట్టాడు.

‘జూనియర్ కోల్‌కతా’ అని బెట్టింగ్ రాయుళ్లు ముద్దుగా పిలుచుకునే జలాన్ దేశవ్యాప్తంగా జరిగే బెట్టింగ్ వ్యాపారాలలో కీలకమైన వ్యక్తి. అతడి బెట్టింగ్ వ్యాపారాల వార్షిక టర్నోవర్ రూ.100 కోట్లని పోలీసులు చెప్పడం విస్మయానికి గురిచేస్తోంది.

  • Loading...

More Telugu News