Myanmar: రోహింగ్యా ముస్లింలు ఇక స్వచ్ఛందంగా తిరిగి రావచ్చు: మయన్మార్ ప్రకటన
- సింగపూర్లో కొనసాగుతోన్న ప్రాంతీయ భద్రతాదళ సమావేశం
- ప్రకటించిన మయన్మార్ జాతీయ భద్రత సలహాదారు
- గతేడాది రోహింగ్యాలపై మయన్మార్ సైన్యం దాడి
తమ దేశం నుంచి పారిపోయిన రోహింగ్యా ముస్లింలు ఇక స్వచ్ఛందంగా తిరిగి రావచ్చని మయన్మార్ ప్రకటించింది. సింగపూర్లో కొనసాగుతోన్న ప్రాంతీయ భద్రతాదళ సమావేశంలో మయన్మార్ జాతీయ భద్రత సలహాదారు థాంగ్ మాట్లాడుతూ ఈ ప్రకటన చేశారు. రోహింగ్యాలు వస్తామంటే తమ దేశం వారికి స్వాగతం పలుకుతుందని, ఐక్యరాజ్యసమితి బాధ్యతలను కాపాడటానికి తమ రఖైన్ రాష్ట్రంలో నివసించిన రోహింగ్యాలను ఆహ్వానించాల్సి ఉందని అన్నారు.
రోహింగ్యాలు దారుణాలకు పాల్పడుతున్నారని పేర్కొంటూ గతేడాది వారిపై మయన్మార్ సైన్యం దాడి చేసిన విషయం విదితమే. అనంతరం అక్కడి నుంచి పారిపోయిన రోహింగ్యాలు బంగ్లాదేశ్తో పాటు పలు దేశాలకు వలస వెళ్లి తలదాచుకున్నారు.