NARADA: విశ్వంలో తొలి జర్నలిస్టు నారదుడే అన్న దానిపై భిన్నాభిప్రాయాల్లేవు: ఆర్ఎస్ఎస్
- ఇది విశ్వాసానికి సంబంధించిన విషయం
- దీనిపై చర్చించడం అర్ధరహితం
- దేవతలు, దానవులు కూడా ఆయన్ను గౌరవించేవారు
- ఆర్ఎస్ఎస్ పబ్లిసిటీ ఇన్ చార్జ్ నరేంద్ర జైన్
జర్నలిజం అన్నది ప్రాచీన భారతంలోనే మొదలైందన్న ఉత్తరప్రదేశ్ డిప్యూటీ సీఎం దినేశ్ శర్మ వ్యాఖ్యలను ఆర్ఎస్ఎస్ పబ్లిసిటీ ఇన్ చార్జ్ నరేంద్ర జైన్ సమర్థించారు. ఈ విశ్వంలో మొదటి జర్నలిస్ట్ నారద ముని అనేది ఆర్ఎస్ఎస్ విశ్వాసంగా శర్మ పేర్కొన్నారు. ఆధునిక టెక్నాలజీని ప్రాచీన భారతానికి అన్వయిస్తూ నారదుడ్ని మొదటి గూగుల్ గా అభివర్ణించారు.
దీనిపై నరేంద్ర జైన్ స్పందిస్తూ ‘‘నారదుడు ఈ విశ్వం మొత్తానికే మొదటి జర్నలిస్టు. దీనిపై రెండు అభిప్రాయాలు లేవు. ఇది విశ్వాసానికి సంబంధించిన విషయం. దీనిపై చర్చ నిష్ఫలం. నారదుడు ప్రపంచ శాంతి కోసం పనిచేశారు. దేవతలు, దానవులు కూడా ఆయన్ను గౌరవించేవారు. అందిరినీ ఒకే కుటుంబంగా ఉంచేందుకు ఆయన ప్రయత్నించారు’’ అని నరేంద్ర జైన్ వివరించారు. సంప్రదింపుల్లో నారదుడు మాస్టర్ అని, జర్మలిజం మూలాలు ఆయనకు తెలుసునని మరో ఆర్ఎస్ఎస్ నేత పేర్కొన్నారు.