Karnataka: కర్ణాటక ముఖ్యమంత్రితో కమలహాసన్ భేటీ
- బెంగళూరులో కొనసాగుతోన్న చర్చలు
- కావేరి జలాల వివాదానికి చరమ గీతం పాడాలన్న కమల్
- ఇరు రాష్ట్రాల రైతులు నష్టపోకుండా చూడాలని వినతి
తమిళనాడు, కర్ణాటకల మధ్య దశాబ్దాలుగా వివాదాస్పదంగా ఉన్న కావేరి జలాల అంశంపై మక్కల్ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు, సినీనటుడు కమలహాసన్.. బెంగళూరులో కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామితో చర్చలు జరుపుతున్నారు.
కావేరి జలాల వివాదం పరిష్కారంపై ప్రత్యేక చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉందని కుమారస్వామితో ఆయన అన్నారు. అటు తమిళనాడు, ఇటు కర్ణాటక రైతులు నష్టపోకుండా ఈ సమస్యకు చరమగీతం పాడాలని ఆయన కోరుతున్నారు. వీరిరువురి భేటీ ముగిసిన అనంతరం కమలహాసన్ మీడియాతో మాట్లాడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.