petrol: మోదీకి చురక.. ప్రధాని సహాయ నిధికి 9 పైసలకు చెక్ పంపిన తెలుగు వ్యక్తి!
- కలెక్టర్‌కు చెక్ అందించిన చందు
- ప్రధాని రిలీఫ్ ఫండ్‌కు పంపాలని విజ్ఞప్తి
- ఈ ఆర్థిక సాయాన్ని ఉపయోగించుకోమని చురక
పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలపై కేంద్ర ప్రభుత్వ తీరుకి వాహనదారులు మండిపడుతోన్న విషయం తెలిసిందే. పెట్రోల్ ధరలు పెరిగితే దాని ప్రభావంతో ఇతర నిత్యావసర ధరలు కూడా పెరుగుతున్నాయని సామాన్య ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రూపాయల్లో ధరలు పెంచేసి, పైసల్లో తగ్గిస్తుండడం పట్ల అసంతృప్తిగా ఉన్నారు. కేంద్ర సర్కారు తీరుకి నిరసనగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో చందు గౌడ్ అనే ఓ వ్యక్తి.. ప్రధాని నరేంద్ర మోదీకి 9 పైసలకు ఓ చెక్కు పంపాడు.
తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ కృష్ణ భాస్కర్‌కు ఆయన ఆ చెక్‌ను అందించాడు. ఇటీవల పెట్రోల్ ధరలను 9 పైసలు తగ్గించారని, అందుకే తాను ప్రధాని రిలీఫ్ ఫండ్‌కు 9 పైసలు విరాళంగా ఇస్తున్నానని పేర్కొన్నాడు. తాను చేసిన ఈ ఆర్థిక సాయంతో ధనవంతులకు సాయం చేయాలని కోరాడు.