sensex: వరుసగా రెండో రోజు బేర్ మన్న మార్కెట్లు
- మార్కెట్లపై ఆర్బీఐ మానిటరీ పాలసీ ప్రభావం
- 109 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
- 10,593 వద్ద స్థిరపడ్డ నిఫ్టీ
ఆర్బీఐ మానిటరీ పాలసీ ఉన్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తుండటంతో భారతీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు నష్టాలను నమోదు చేశాయి. ఉదయం భారీ లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు క్రమంగా అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ఈ నేపథ్యంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి... సెన్సెక్స్ 109 పాయింట్లు నష్టపోయి 34,903 కు పడిపోయింది. నిఫ్టీ 35 పాయింట్లు కోల్పోయి 10,593 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
లక్ష్మీవిలాస్ బ్యాంక్ (4.91%), సిప్లా (3.97%), ఇంటలెక్ట్ డిజైన్ ఎరీనా లిమిటెడ్ (3.45%), హ్యాథ్ వే కేబుల్ అండ్ డేటా (3.15%), బలరాంపూర్ చీనీ మిల్స్ (3.14%).
టాప్ లూజర్స్:
హెచ్డీఐఎల్ (-11.09%), ఐడియా సెల్యులార్ (-9.96%), అవంతి ఫీడ్స్ లిమిటెడ్ (-9.12%), రిలయన్స్ కమ్యూనికేషన్స్ (-7.94%).