that is maha lakshmi: తమన్నా చిత్రానికి ‘దటీజ్ మహాలక్ష్మి’ టైటిల్ ఖరారు
- తెలుగులోకి రీమేక్ అవుతున్న బాలీవుడ్ మూవీ ‘క్వీన్’
- ‘దటీజ్ మహాలక్ష్మి’గా టైటిల్ ఖరారు
- ‘100% లవ్ చిత్రం’లో నా పాత్ర పేరు మహాలక్ష్మి
- ఇదే పేరు ఈ చిత్రానికి పెట్టడం ఆనందంగా ఉంది: తమన్నా
గతంలో కంగనా రనౌత్ నటించిన హిందీ హిట్ చిత్రం ‘క్వీన్’ను తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం భాషల్లో రీమేక్ చేస్తున్నారు. అన్ని భాషల్లోకి ఈ చిత్రాన్ని ఒకేసారి తెరకెక్కిస్తున్నారు. కాగా, తెలుగు వెర్షన్ కి ‘దటీజ్ మహాలక్ష్మి’ టైటిల్ ను ఖరారు చేశారు. ఈ విషయాన్ని టైటిల్ రోల్ పోషిస్తున్న మిల్కీ బ్యూటీ తమన్నా చెప్పింది. గతంలో విడుదలైన ‘100% లవ్ చిత్రం’లో మహాలక్ష్మి పాత్రలో తాను నటించిన విషయాన్ని గుర్తుచేసుకుంది. ఇప్పుడు, ఇదే పేరును ఈ చిత్రానికి పెట్టడం తనకు చాలా ఆనందంగా ఉందని చెప్పింది.
కాగా, కన్నడలో పరుల్ యాదవ్, తమిళంలో కాజల్, మలయాళంలో మాంజిమా మోహన్ లు టైటిల్ రోల్ ను పోషిస్తున్నారు. కన్నడ భామ పరుల్ బర్త్ డే ఈరోజు. ఈ సందర్భంగా సినిమా సెట్ లో బర్త్ డే కేక్ కట్ చేసింది. అనంతరం పరుల్ మాట్లాడుతూ, ఈ బర్త్ డే తనకెంతో ప్రత్యేకమని, ఈ చిత్రంలో పని చెయ్యడం మర్చిపోలేని అనుభూతిగా వుందని చెప్పింది. ఈ వేడుకల్లో చిత్రబృందంతో పాటు తమన్నా, కాజల్ కూడా పాల్గొన్నారు.