Shradda: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • లఘు చిత్రంలో నటిస్తున్నహీరోయిన్ 
  • మెగా హీరో చేతిలో పెద్ద బ్రాండ్ 
  • మహేశ్ చిత్రానికి భారీ రేటు

*  ఇటీవల డాక్టర్ రాజశేఖర్ తో కలసి 'గరుడవేగా' చిత్రంలో కథానాయికగా నటించిన శ్రద్దా దాస్ ఇప్పుడు ఓ షార్ట్ ఫిలింలో నటిస్తోంది. ఈ లఘు చిత్రం పేరు 'ప్యూర్ సోల్'. ఇందులో నటిస్తుంటే చాలా సరదాగా వుందని, అన్ని రకాల ఛాయలు ఈ పాత్రలో ఉంటాయని ఆమె చెప్పింది.
*  విభిన్న కథా చిత్రాలను చేస్తూ పేరు తెచ్చుకుంటున్న మెగా ఫ్యామిలీ హీరో వరుణ్ తేజ్ చేతికి ఓ పెద్ద ఎండార్స్ మెంట్ వచ్చింది. ఆర్.ఎస్.బ్రదర్స్ షాపింగ్ మాల్ బ్రాండ్ కు ప్రచారకర్తగా వ్యవహరించడానికి వరుణ్ అంగీకరించాడు. ఈ డీల్ ఏడాది పాటు వుంటుంది.
*  మహేశ్ బాబు, కొరటాల శివ కాంబినేషన్లో వచ్చిన 'భరత్ అనే నేను' చిత్రం హిందీ శాటిలైట్ హక్కులు భారీ రేటుకి అమ్ముడుపోయాయి. సుమారు 22 కోట్లకు ఓ ప్రముఖ సంస్థ ఈ హక్కులను సొంతం చేసుకున్నట్టు సమాచారం. 

  • Loading...

More Telugu News