amith shah: ఉద్ధవ్ ఠాక్రేతో అమిత్ షా కీలక భేటీ
- వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అమిత్ షా వ్యూహాలు
- శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే నివాసానికి చేరుకున్న బీజేపీ చీఫ్
- ఫడ్నవీస్‌తో కలిసి ఉద్ధవ్ ఠాక్రేతో చర్చలు
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా ప్రయత్నాలు మొదలుపెట్టారు. కొంతకాలంగా బీజేపీపై శివసేన పార్టీ తీవ్రంగా విరుచుకుపడుతోన్న విషయం తెలిసిందే. ఎంతో కాలంగా తమకు మిత్ర పక్షంగా ఉంటోన్న శివసేన మద్దతు కూడగట్టేందుకు అమిత్ షా ముంబయి చేరుకున్నారు.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్‌తో కలిసి శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే నివాసానికి చేరుకుని ఆయనతో భేటీ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేసే అంశం చర్చిస్తున్నారు. ఇటీవల జరిగిన పాల్ఘడ్ లోక్‌సభ ఉప ఎన్నికల్లో శివసేన ఓడి బీజేపీ గెలిచిన నేపథ్యంలో ఉద్ధవ్ ఠాక్రే ఆ పార్టీపై విరుచుకుపడ్డ విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ఎన్డీఏకి మద్దతిస్తారా? అన్న ఉత్కంఠ నెలకొంది.