Rajamouli: రామోజీరావు, రాజమౌళికి మధ్య విభేదాలు అంటూ వార్తలు.. శోభు యార్లగడ్డ వివరణ!
- బాహుబలి సినిమా హక్కుల విషయంలో గొడవలని రాతలు
- ఈ వార్తను రీట్వీట్ చేసిన శోభు యార్లగడ్డ
- ఇలాంటి ఫేక్ న్యూస్ సృష్టించకూడదని హితవు
రామోజీ గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు, బాహుబలి దర్శకుడు రాజమౌళికి మధ్య విభేదాలు ఉన్నాయంటూ ఓ వెబ్సైట్ కథనాన్ని ప్రచురించింది. ఆ సినిమాలో రామోజీరావు కూడా భాగస్వామి అంటూ... సినిమా హక్కుల విషయంలోనే గొడవలు వచ్చాయంటూ రాసుకొచ్చింది.
ఈ విషయం గుర్తించిన బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ మండిపడ్డారు. ఈ వార్తను రీట్వీట్ చేసిన శోభు యార్లగడ్డ... ఏ మాత్రం విలువలు పాటించకుండా ఇటువంటి వార్తలు రాసి, అధిక లాభాలు పొందాలని చూడకూడదని అన్నారు. ఇలాంటి ఫేక్ న్యూస్ సృష్టిస్తే, ఆ వెబ్సైట్ కేవలం గాసిప్ వెబ్‌సైట్‌గా మాత్రమే మిగిలిపోతుందని, దానిపై నమ్మకం పోతుందని పేర్కొన్నారు.