Virat Kohli: కోహ్లీకి వరుసగా నాలుగోసారి బీసీసీఐ 'బెస్ట్ ఇంటర్నేషనల్ క్రికెటర్ అవార్డు'
- పాలీ ఉమ్రిగర్ అవార్డు అందుకోనున్న కోహ్లీ
- ఈనెల 12న బెంగళూరులో కార్యక్రమం
- క్రికెట్లో అసాధారణ ప్రతిభ కనబరుస్తున్న విరాట్
క్రికెట్లో అసాధారణ ప్రతిభ కనబరుస్తున్నందుకుగానూ టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని పాలీ ఉమ్రిగర్ అవార్డు మరోసారి వరించింది. ఇప్పటికే మూడు సార్లు ఈ అవార్డు అందుకున్న కోహ్లీ.. ఈనెల 12న బెంగళూరులో జరగనున్న బీసీసీఐ అవార్డు ప్రదాన కార్యక్రమంలో మరోసారి ఈ అవార్డు అందుకోనున్నాడు. 2016-2017, 2017-2018 సంవత్సరాలకు గానూ రెండు అవార్డులను కోహ్లీకి ప్రదానం చేస్తారు. బెస్ట్ ఇంటర్నేషనల్ క్రికెటర్‌కు అవార్డు అందించడానికి బీసీసీఐ పాలీ ఉమ్రిగర్ అవార్డును 2006లో ప్రవేశపెట్టింది.
ఆ ఏడాది సచిన్ టెండూల్కర్ దీనిని అందుకోగా ఆ తరువాతి ఏడాదుల్లో వరుసగా సెహ్వాగ్, గంభీర్, సచిన్, ద్రవిడ్, విరాట్ కోహ్లీ, అశ్విన్, భువనేశ్వర్ కుమార్ అందుకున్నారు. 2014 నుంచి ఈ అవార్డు విరాట్ కోహ్లీకే సొంతమవుతూ వస్తోంది. మహిళా క్రికెటర్లలో 2016-2017 సీజన్‌కుగాను హర్మన్‌ప్రీత్ కౌర్, 2017-2018 సీజన్‌కు గాను స్మృతి మందనకు ఈ అవార్డు దక్కింది. గత రెండేళ్లకు సంబంధించిన అవార్డులను ఒకేసారి ప్రకటించారు.