Donald Trump: కిమ్ జాంగ్ ఉన్ ను అమెరికాకు ఆహ్వానిస్తా: ట్రంప్ మరో సంచలన వ్యాఖ్య
- కిమ్ తో చర్చలు సఫలమైతే వైట్ హౌస్ కు ఆహ్వానిస్తా
- సమావేశంలో సమస్య వస్తే లేచి వెళ్లిపోతా
- కొరియాకు మంచి చేయాలని కిమ్ భావిస్తున్నారని నమ్ముతున్నా
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన వ్యాఖ్య చేశారు. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ తో సింగపూర్ లో జరగనున్న సమావేశం సఫలమైతే... ఆయనను అమెరికాకు ఆహ్వానిస్తామని చెప్పారు. వైట్ హౌస్ లో ఆతిథ్యమిస్తానని తెలిపారు. సమావేశంలో కిమ్ తో ఏదైనా సమస్య వస్తే... మధ్యలోనే లేచి పోతానని చెప్పారు. అయితే, అంత అవసరం రాదనే అనుకుంటున్నానని తెలిపారు. ఉత్తర కొరియా ప్రజల కోసం ఏదైనా గొప్ప పని చేయాలని కిమ్ భావిస్తున్నారని తాను నమ్ముతున్నానని చెప్పారు.