Karnataka: ప్రజల్ని ఎంత కాలం పిచ్చివాళ్లను చేస్తారు..? పాలన ఎప్పుడు చేస్తారు?: ప్రకాష్ రాజ్ ప్రశ్నలు
- బీజేపీ అధికారం, డబ్బుతో లాబీయింగ్ చేసింది
- కాంగ్రెస్/జేడీఎస్ మంత్రిత్వ పదవులతో లాబీయింగ్ చేస్తున్నాయి
- ఎంత కాలం ప్రజల్ని పిచ్చివాళ్లను చేస్తారు?
కర్ణాటక నేతలపై నటుడు ప్రకాష్ రాజ్ మరోసారి విమర్శలు చేశారు. కన్నడనాట రాజకీయాలను తన వ్యాఖ్యల్లో తీవ్రంగా తప్పుబట్టారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్లో తాజాగా పోస్ట్ పెట్టారు. ‘‘కర్ణాటక రాజకీయాలు..!! ఒక పార్టీ బీజేపీ డబ్బు, అధికారంతో లాబీయింగ్ కు ప్రయత్నించింది... మీరు కాంగ్రెస్/జేడీఎస్ నేతలు మంత్రిత్వ పదవులతో లాబీయింగ్ చేస్తున్నారు... రెండు మార్గాల్లోనూ మీరందరూ మిమ్మల్ని మీరు అమ్ముకుంటున్నారు. ఎంత కాలం పాటు మీరు పౌరులను పిచ్చివాళ్లను చేస్తారు? ఎప్పుడు పరిపాలన చేస్తారు?’’ అని ప్రకాష్ రాజ్ తన ట్వీట్లో కడిగి పారేశారు.