tmu: ప్రభుత్వం మాకు స్పష్టమైన హామీ ఇవ్వలేదు: ఆర్టీసీ సమ్మెపై టీఎంయూ అధ్యక్షుడు
- లాభనష్టాలతో సంబంధం లేకుండా ఆలోచించాలి
- ఎన్నో సంస్థలు నష్టాలతో నడుస్తాయి
- కానీ, ప్రభుత్వం కనీస బాధ్యత వహించాలి
తమ డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాల్సిందేనని టీఎంయూ అధ్యక్షుడు అశ్వత్థామ రెడ్డి అన్నారు. ఈ రోజు హైదరాబాద్‌లో ఆర్టీసీ సంఘాలతో తెలంగాణ మంత్రి మహేందర్ రెడ్డి చర్చించిన విషయం తెలిసిందే. అనంతరం అశ్వత్థామరెడ్డి మీడియాతో మాట్లాడుతూ..."మేము గతంలోనే చెప్పాం.. ఆర్టీసీ లాభనష్టాలతో సంబంధం లేకుండా కార్మికుల విషయం గురించి ఆలోచించాలి. ఎన్నో సంస్థలు నష్టాలతో నడుస్తాయి. కానీ, ప్రభుత్వం కనీస బాధ్యత వహించాలి. మాకు స్పష్టమైన హామీ ఇవ్వలేదు. మాకు డైరెక్టర్ పోస్టులు టిష్యూ పేపర్లతో సమానం" అన్నారు.
ఇతర యూనియన్ల నాయకులు మాట్లాడుతూ... ఈనెల 11న జరిగే సమ్మెను వాయిదా వేయలేదని, రేపు మధ్యాహ్నం యూనియన్ నేతలతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశామని అన్నారు. ఎన్నికల పేరుతో తమ సమస్యను పక్కదారి పట్టించకూడని వ్యాఖ్యానించారు. తమ సమస్యలకు పరిష్కారం చూపమని కోరితే, చర్చలను కూడా వాయిదా వేస్తూ తరువాత మాట్లాడుకుందామంటున్నారని అన్నారు.