rtc: ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు సరైనవే.. ప్రైవేటు పరం చేయకూడదు: ప్రొ.కోదండరామ్
- కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు బాధాకరం
- ఆ సంస్థను ప్రైవేటు పరం చేయకూడదు
- ప్రభుత్వమే ఆర్టీసీని నడిపించాలి
- ఆర్టీసీ సంఘాలతో చర్చించి సమస్యను పరిష్కరించాలి
ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు సరైనవేనని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొ.కోదండరామ్ అన్నారు. వారిపై సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు బాధాకరమని, ఆ సంస్థను ప్రైవేటు పరం చేయకూడదని, ప్రభుత్వమే నడిపించాలని వ్యాఖ్యానించారు. ఆర్టీసీ సంఘాలతో చర్చించి సమస్యను పరిష్కరించాలని సూచించారు. కార్మికులు సమ్మెకు దిగితే ప్రభుత్వానిదే బాధ్యతని అన్నారు. వారి జీతాలు తక్కువగా ఉన్నాయని చెప్పారు.
ఈరోజు కరీంనగర్‌లోని శుభం గార్డెన్స్‌లో టీజేఎస్ నేతల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కోదండరామ్, కనకయ్య, ఇతర ముఖ్య నాయకులు హాజరయ్యారు. ఆ సందర్భంగా పలువురు నేతలు ఆ పార్టీలో చేరారు. అనంతరం కోదండరామ్ మాట్లాడుతూ తెలంగాణ సర్కారు పనితీరుపై విమర్శలు చేశారు. రైతుల పట్ల సర్కారు వివక్ష చూపుతోందని, భూ రికార్డుల ప్రక్షాళనలో అవకతవకలు ఉన్నాయని అన్నారు.