India: భారత్‌లో కశ్మీర్ ఉన్నట్లు స్కూలు పుస్తకాల్లో ముద్రణ.. నిషేధించిన పాకిస్థాన్
- ఆ పుస్తకాల్లో మరిన్ని అభ్యంతరకర అంశాలు
- పాక్‌లోని పంజాబ్ పరిసర ప్రాంతాల్లో పుస్తకాలు
- ఆయా విద్యాసంస్థల నిర్వాహకులపై క్రిమినల్ కేసులు
తమ దేశంలో 2, 4, 5, 7, 8 తరగతుల సాంఘిక శాస్త్ర పుస్తకాల్లో మ్యాప్‌లో కశ్మీర్ భూభాగం భారత్‌లో అంతర్భాగమని ఉండడంతో పాకిస్థాన్ వాటిని నిషేధించింది. అంతేగాక, ఆ పుస్తకాల్లో మరిన్ని అభ్యంతరకర అంశాలు ఉన్నాయని పేర్కొంది.
పాక్‌లోని పంజాబ్ పరిసర ప్రాంతాల్లోని ప్రైవేట్ పాఠశాల్లో ఈ పుస్తకాలు ఉన్నట్లు తెలిపింది. పంజాబ్‌లో వెంటనే ఆ పుస్తకాలను నిషేధించాలని పీసీటీబీ మేనేజింగ్ డైరెక్టర్ అబ్దుల్ ఖయ్యూమ్ ఆదేశాలు జారీ చేశారు. అలాగే, ఆయా విద్యాసంస్థల నిర్వాహకులు, పుస్తకాల పబ్లిషర్స్‌పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సూచించారు.