Telangana: మరింత కఠినంగా ముందుకు... తెలంగాణ ఆర్టీసీ కార్మికులపై ఎస్మా ప్రయోగం?
- కడియం నివాసంలో భేటీ అయిన స్ట్రాటజిక్ కమిటీ
- కొనసాగుతోన్న చర్చలు
- పాల్గొన్న తెలంగాణ మంత్రులు
తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు ఎల్లుండి నుంచి నిరవధిక సమ్మెకు దిగడానికి సిద్ధమవుతున్నారు. మరోపక్క వీరి డిమాండ్లను పరిష్కరించడానికి ప్రభుత్వం సానుకూలంగా లేదు. ఇప్పటికే ఆర్టీసీ నష్టాల్లో ఉందని, వేతనాలు పెంచలేమని సర్కారు అంటోంది. నిన్న మంత్రి మహేందర్‌రెడ్డి ఆర్టీసీ సంఘాలతో చర్చించగా ఆ చర్చలు పరిష్కార మార్గాన్ని చూపలేదు. ఈరోజు టీఎంయూ నేతలు తమ యూనియన్లతో మరోసారి చర్చలు జరుపుతున్నారు.
మరోవైపు తెలంగాణ మంత్రి కడియం శ్రీహరి నివాసంలో భేటీ అయిన స్ట్రాటజిక్ కమిటీ ఈ విషయంపై చర్చలు జరుపుతోంది. కడియం శ్రీహరి అధ్యక్షతన జరుగుతోన్న ఈ సమావేశంలో మంత్రులు హరీశ్ రావు, ఈటల రాజేందర్, తుమ్మల నాగేశ్వరరావు, కేటీఆర్, మహేందర్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి పాల్గొన్నారు. ఆర్టీసీ సమ్మె విషయంపై చర్చిస్తున్నారు. అవసరమైతే ఎస్మా ప్రయోగించాలని యోచిస్తున్నారు.