rtc: ఆర్టీసీ కార్మికులతో ముగిసిన తెలంగాణ మంత్రుల చర్చలు
- ప్రగతి భవన్‌కు బయలుదేరిన మంత్రులు
- కాసేపట్లో సీఎం కేసీఆర్‌తో భేటీ
- ఆర్టీసీ సంఘాల తుది ప్రతిపాదనలు సీఎం వద్దకు..
నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చిన ఆర్టీసీ కార్మిక సంఘాలతో తెలంగాణ రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి సహా పలువురు మంత్రులు ఈరోజు మరోసారి చర్చించారు. వారి అభిప్రాయాలను తీసుకున్న మంత్రులు హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి ప్రగతి భవన్‌కు బయలుదేరారు. ఆర్టీసీ సంఘాల ప్రతిపాదనలను ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తెలిపి నిర్ణయం తీసుకోనున్నారు.
కాగా, రేపటి నుంచి సమ్మెకు దిగుతామని ఇప్పటికే ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వానికి నోటీసు ఇచ్చిన విషయం తెలిసిందే. తెలంగాణ మంత్రి కడియం శ్రీహరి నేతృత్వంలో మంత్రులు హరీశ్ రావు, ఈటల రాజేందర్, తుమ్మల నాగేశ్వరరావు, కేటీఆర్, మహేందర్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి ఇప్పటికే ఈ విషయంపై పలుసార్లు చర్చలు జరిపినప్పటికీ అవి ఓ కొలిక్కి రాలేదు.