Telangana: ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగితే.. తీసుకోవాల్సిన ప్రత్యామ్నాయ చర్యలపై తెలంగాణ సీఎస్ చర్చలు
- రేపటి నుంచి సమ్మె?
- కొనసాగుతోన్న చర్చలు
- తెలంగాణ డీజీపీ, రవాణాశాఖ ముఖ్య కార్యదర్శితో సీఎస్ భేటీ
తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు రేపటి నుంచి సమ్మెకు సిద్ధమవుతోన్న విషయం తెలిసిందే. ఈరోజు జరుగుతోన్న చర్చలు ఉత్కంఠ రేపుతున్నాయి. సమ్మెకు దిగితే కఠిన చర్యలు తప్పవని ప్రభుత్వం హెచ్చరించినప్పటికీ ఆర్టీసీ సంఘాలు వెనక్కు తగ్గట్లేదు. కాసేపట్లో తెలంగాణ మంత్రులు మీడియా ముందుకు వచ్చి ఈ విషయంపై ప్రకటన చేయనున్నారు. అయితే, తెలంగాణ డీజీపీ, రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి, ఆర్డీసీ ఎండీలతో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి సమావేశమయ్యారు. ఒకవేళ ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగితే.. తీసుకోవాల్సిన ప్రత్యామ్నాయ చర్యలపై కీలక చర్చలు జరుపుతున్నారు.