Donald Trump: కిమ్ తో భేటీ ముగిసిన తరువాత తొలి ప్రకటన చేసిన ట్రంప్!
- ముగిసిన ఇరు దేశాధినేతల చర్చలు
- గంటన్నర పాటు సాగిన సమావేశం
- సత్ఫలితాలను ఇస్తాయనే నమ్ముతున్నా
- అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్
ప్రపంచ దేశాలు ఆసక్తిగా ఎదురుచూసిన డొనాల్డ్ ట్రంప్, కిమ్ జాంగ్ ఉన్ ల కీలక భేటీ సింగపూర్ లోని కేపెల్లా హోటల్ లో ముగిసింది. సుమారు గంటన్నర పాటు వీరిద్దరి మధ్యా చర్చలు సాగగా, అణ్వాయుధాలను వీడాలన్న డిమాండ్ పైనే ప్రధానంగా ట్రంప్ మాట్లాడినట్టు తెలుస్తోంది.
ఇక ఈ భేటీ అనంతరం ట్రంప్ స్పందిస్తూ, సహృద్భావ వాతావరణంలో కిమ్ తో చర్చలు సాగినట్టు వెల్లడించారు. ప్రపంచాన్ని భయపెడుతున్న ఓ పెద్ద సమస్యను పరిష్కరించాలన్న ఉద్దేశంతో తామిరువురమూ కలిశామని, కిమ్ తో ఏకాంతంగా జరిపిన చర్చలు సత్ఫలితాలను ఇస్తాయనే నమ్ముతున్నానని ట్రంప్ వ్యాఖ్యానించారు. కాగా, నేటి మధ్యాహ్నం తరువాత ట్రంప్, కిమ్ ల ఉమ్మడి మీడియా సమావేశం ఉంటుందని సమాచారం.