donald trump: ట్రంప్, కిమ్ జాంగ్ ల భేటీ నేపథ్యంలో.. గూగుల్ లో అమెరికన్ల వెతుకులాట!
- ట్రంప్, కిమ్ ల చర్చలపై అమెరికన్ల ఆసక్తి
- పలు విషయాలపై గూగుల్ లో శోధన
- సింగపూర్ ఎక్కడ ఉంది అనే విషయంపై ఎక్కువ సెర్చ్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ ల మధ్య సింగపూర్ లో జరిగిన చర్చలు సఫలీకృతమయ్యాయి. ఇద్దరు అధినేతలు భేషజాలకు పోకుండా పూర్తి సమన్వయంతో చర్చలు జరిపారు. మరోవైపు, వీరిద్దరి మధ్య భేటీ జరగబోతోంది అనే వార్తలు వెలువడగానే అమెరికన్లలో ఎంతో ఆసక్తి నెలకొంది. పలు విషయాల గురించి తెలుసుకునేందుకు వారు గూగుల్ లో శోధించారు. అమెరికన్లు ఎక్కువగా సెర్చ్ చేసిన అంశాలు ఇవే.
- సింగపూర్ ఎక్కడ ఉంది?
- నార్త్ కొరియా ఎక్కడ ఉంది?
- సింగపూర్ ఒక దేశమేనా?
- సింగపూర్ చైనాలో ఉందా? జపాన్ లో ఉందా?
- కిమ్ జాంగ్ ఎత్తు ఎంత?
- కిమ్ జాంగ్ ఇంగ్లీష్ మాట్లాడగలడా?