sensex: ట్రంప్, కిమ్ ల ఎఫెక్ట్.. లాభాలను మూటగట్టుకున్న మార్కెట్లు
- సింగపూర్ లో ట్రంప్, కిమ్ ల కీలక భేటీ
- తొలగిన ఉద్రిక్తతలు
- ఉత్సాహంగా ట్రేడింగ్ చేసిన ఇన్వెస్టర్లు
సింగపూర్ లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉత్తరకొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ ల చారిత్రాత్మక భేటీ నేపథ్యంలో, ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న టెన్షన్ కు శుభం కార్డు పడింది. దీని ప్రభావంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మార్కెట్లన్నీ పాజిటివ్ గా ట్రేడ్ అయ్యాయి. దేశీయ మార్కెట్లలో కూడా ఇన్వెస్టర్లు ఉత్సాహంగా ట్రేడింగ్ చేశారు. ఈ నేపథ్యంలో, ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి... సెన్సెక్స్ 209 పాయింట్లు లాభపడి 35,693కు పెరిగింది. నిఫ్టీ 56 పాయింట్ల లాభంతో 10,843 వద్ద స్థిర పడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఎంఎంటీసీ లిమిటెడ్ (13.65%), హెచ్సీఎల్ ఇన్ఫోసిస్టమ్స్ (11.80%), మార్క్ శాన్స్ ఫార్మా (7.53%), షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (6.76%), గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్ (5.83%).
టాప్ లూజర్స్:
క్వాలిటీ (-4.90%), గేట్ వే డిస్ట్రిపార్క్స్ లిమిటెడ్ (-3.95%), దీపక్ ఫర్టిలైజర్స్ (-3.54%), దాల్మియా భారత్ లిమిటెడ్ (-3.46%), అవంతి ఫీడ్స్ (-3.21%).