kim: అత్యాధునిక టాయ్ లెట్ ను వెంట తెచ్చుకున్న కిమ్!
- ఆరోగ్య సమస్యలను పశ్చిమదేశాలు గుర్తించకుండా కిమ్ జాగ్రత్త
- అత్యాధునిక మొబైల్ టాయ్ లెట్ ను వెంట తీసుకెళ్లిన వైనం
- విసర్జక పదార్థాలను డిస్పోజ్ చేసే టాయ్ లెట్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ ఈరోజు సింగపూర్ లో భేటీ అయిన విషయం తెలిసిందే. ఇద్దరి మధ్య జరిగిన ద్వైపాక్షిక చర్చల్లో పలు ఒప్పందాలు జరిగాయి. ఈ విషయాన్ని పక్కన బెడితే, కిమ్ జాంగ్ ఉన్ పర్యటనలో ఓ ఆసక్తికర అంశం చోటు చేసుకుంది. సింగపూర్ కు కిమ్ తో పాటు ఓ అత్యాధునిక మొబైల్ టాయ్ లెట్ కూడా వచ్చినట్టు దక్షిణ కొరియాలోని ఓ వార్తా పత్రిక కథనం. తన ఆరోగ్య రహస్యాలను పశ్చిమ దేశాలు కనిపెట్టకుండా ఉండే నిమిత్తం కిమ్ ఈ జాగ్రత్త తీసుకున్నట్టు సమాచారం.
తన విసర్జక పదార్థాలను పశ్చిమ దేశాలు పరీక్షించి ఆరోగ్య సమస్యలను అంచనా వేసే అవకాశం ఉందని కిమ్ భయపడిన నేపథ్యంలోనే ఈ ఏర్పాటు చేసుకున్నట్టు ఆ కథనంలో పేర్కొన్నారు. విసర్జక పదార్థాలను డిస్పోజ్ చేయగల అత్యాధునికమైన టాయ్ లెట్ ను తయారు చేయించుకుని కిమ్ తన వెంట తెచ్చుకున్నారని తెలిపింది. కాగా, స్థూలకాయంతో బాధపడుతునన్న కిమ్ జాంగ్ ఉన్ కు ఫాటీ లివర్ తో పాటు, షుగర్, హై బీపీ, కీళ్ల వాతం కూడా ఉన్నాయి.