sarijinidevi: సరోజనీ దేవి కంటి ఆసుపత్రికి మహర్దశ.. ఐ బ్యాంకు, రూ.కోటి విలువ చేసే అత్యాధునిక పరికరాలు
- కొత్త ఏసీ పోస్ట్-ఆపరేటివ్ వార్డు
- నేత్రాల సేకరణకు అంబులెన్స్
- రేపు ప్రారంభించనున్న తెలంగాణ మంత్రి లక్ష్మారెడ్డి
కంటి వైద్యం, శస్త్ర చికిత్సలకు సంబంధించి పెట్టింది పేరైన హైదరాబాద్లోని ప్రభుత్వ సరోజనీ దేవి ఆసుపత్రికి మహర్దశ వచ్చింది.. రూ.కోటి విలువైన అత్యాధునిక పరికరాలతో కూడిన కొత్త ఐ బ్యాంకు ఏర్పాటైంది. ఏసీ పోస్ట్-ఆపరేటివ్ వార్డు కూడా రూపుదిద్దుకుంది. నేత్రాల సేకరణ కోసం ఒక అంబులెన్స్ రెడీగా ఉంది. వీటన్నింటినీ వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ మంత్రి లక్ష్మారెడ్డి రేపు ఉదయం 11 గంటలకు ప్రారంభించనున్నారు.
ఇప్పటి వరకు ఉన్న కలెక్షన్ సెంటర్ని ఐ బ్యాంకుగా తీర్చిదిద్దుతున్నారు. అలాగే, మొదటిసారిగా పోస్ట్-ఆపరేటివ్ వార్డుని 20 పడకలతో సెంట్రలైజ్డ్ ఏసీతో ఏర్పాటు చేస్తున్నారు. ఐ బ్యాంకు కోసం నేత్రాల సేకరణకు ఒక నూతన అంబులెన్స్ ఏర్పాటవుతోంది. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొంటారని సరోజనీ కంటి వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ రవీందర్ గౌడ్ తెలిపారు.