kumaraswamy: కర్ణాటక ప్లానింగ్ బోర్డు చీఫ్గా ‘ఇన్ఫోసిస్’ నారాయణమూర్తి!
- కుమారస్వామి మరో సంచలన నిర్ణయం
- 6న నారాయణమూర్తిని కలిసి చర్చలు
- ప్రభుత్వ ప్రతిష్ఠ పెంచే ప్రయత్నమన్న సీఎం
రాష్ట్ర ప్రణాళిక మండలి చీఫ్గా ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణమూర్తిని నియమించాలని కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 6న నారాయణమూర్తిని ఆయన నివాసంలోనే కలిసిన కుమారస్వామి ఈ విషయమై చర్చించారు. బుధవారం కుమారస్వామి మాట్లాడుతూ.. నారాయణమూర్తిని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు (డిప్యూటీ చైర్మన్)గా నియమించడం వల్ల ప్రభుత్వ ప్రతిష్ఠ పెరుగుతుందని చెప్పారు. అలాగే పెట్టుబడులను కూడా ఆకర్షించవచ్చని పేర్కొన్నారు. మరికొందరిని కూడా సభ్యులుగా నియమించేందుకు ప్రయత్నిస్తున్నట్టు సీఎం కుమారస్వామి తెలిపారు.